క్షేత్ర పర్యటనలో లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని  లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు హైదరాబాదులో వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. క్షేత్ర పర్యటలో భాగంగా హైదరాబాదులోని వివిధ సాలెపాల్గొన్న బిర్లా సైన్స్ మ్యూజియం, బిర్లా మందిర్ వరల్డ్ వాటర్ (జలవిహార్) అసెంబ్లీ, అంబేడ్కర్ ,చార్మినార్ ఎన్టీఆర్ గార్డెన్, వంటి ప్రదేశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ జ్ఞానానికి సంబంధించిన అంశాలను సాంఘిక పరిజ్ఞానాన్ని పొందుపరచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ వినోద పర్యటన వలన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపచని అంతేకాకుండా ఈ పర్యటన వలన విద్యార్థులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారని, అంతేకాకుండా చదువుతోపాటు వాళ్ళ ఆరోగ్యం మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని ప్రతి ఏటా తమ పాఠశాలలో ఇలాంటి పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కూడా తాము ప్రతి ప్రదేశం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నామని ఆటలు పాటలు వలన ఎంత సంతోషంగా గడిపామని, విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.