– సెల్ పాయింట్ యూనియన్ సభ్యులు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రి గుట్టకు ఆషాడ మాస వనభోజనాల కార్యక్రమంలో భాగంగా బస్సులో దాదాపు 40 మంది విహారయాత్రగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు చౌటపల్లి వెంకటేష్ మాట్లాడుతూ పట్టణంలోని యూనియన్ యజమానులందరం కలిసి ఆషాడ మాసంలో ఎంతో విశిష్టత గల లింబాద్రి గుట్టపై పచ్చదనాన్ని పరుచుకున్నటువంటి ప్రకృతిని, పారేటి జలపాతాలను ఆస్వాదించడానికి కలిసికట్టుగా బస్సులో తరలి వెళ్తున్నట్లు తెలిపారు. పచ్చటి ప్రకృతి అందాల మధ్య చక్కటీ వనభోజనాలు చేసి తిరిగి వేములవాడకు రానున్నట్లు వివరించారు. ఎప్పుడు ఒత్తిడిగా ఉండే యూనియన్ సభ్యులు మానసిక ప్రశాంతతను పొందడానికే పచ్చటి చెట్లు, కొండల ప్రాంతం అయినటువంటి లింబాద్రిగుట్టపై వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని యజమానులు, రాజస్థాన్ మార్వాడి షాపు నిర్వాహకులు తదితరులు ఉన్నారు.