యూరో కిడ్స్ ప్లే ఏసి క్యాంపస్ ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త లింగ నరసింహరావు

నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో యూరో కిడ్స్ ప్లే ఏసీ క్యాంపస్ ను వినియోగించుకోవాలని ప్రముఖ వస్త్ర వ్యాపారవేత లింగ నరసింహారావు కోరారు సోమవారం పట్టణంలోనికి సన్ నగర్ లో యూరో కిడ్స్ ప్లే ఏసీ క్యాంపస్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలో మొట్టమొదటిసారిగా ఏసీ క్యాంపస్ ను ప్రారంభించిన విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్  స్కూల్స్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డిని అభినందించారు. విద్యార్థులకు మంచి నైపుణ్యం గల విద్యను అందించాలన్నారు. క్రమశిక్షణ విలువలు నేర్పించాలని వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా పేరు గడించేందుకు కృషి చేయాలని కోరారు.  విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ,యూరో కిడ్స్ ప్లే చైర్మన్  డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన ప్లేవే మెథడ్ ద్వారా మరియు టెక్నాలజీ పరంగా ఆడియో మరియు వీడియో విజువల్ ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పగిడాల పురంధర్ రెడ్డి, ఎంపల్ల బుచ్చిరెడ్డి, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, జైని రవీందర్ గుప్తా, కళ్లెం రఘుపతి రెడ్డి, పగిడాల రామ్ రెడ్డి, కొమ్మిడి కరుణాకర్ రెడ్డి, బంధుమిత్రులు, ఉపాధ్యాయ బృందం,  తల్లిదండ్రులు, పాల్గొన్నారు.