లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి..

Lingamantula fair should be recognized as a state festival. ఓయూ గొల్లగట్టు సాంస్కృతిక చరిత్రపై సెమినార్‌ లో వక్తలు
నవతెలంగాణ – ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో  “గొల్లగట్టు సాంస్కృతిక చరిత్రపై సెమినార్ ” ను శనివారం ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు.  సూర్యాపేట జిల్లా లోని గొల్లగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని‌,పూర్తికాల చైర్మైన్,కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. జాతర సమయంలోనె పరిమితమైన నిధులు కాకుండ అధిక నిధులు కెటాయించి సంవత్సరం పొడవున మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గొల్లగట్టు జాతరపై అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలను మానుకొని అక్కడ యాదవుల ఆశ్రిత కులాలైన బైకాని వారిని ప్రభుత్వం గుర్తించాలని,వారికి ప్రభుత్వ  వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొ. కంచె ఐలయ్య షెఫర్డ్,ప్రొ. సింహాద్రి,ప్రొ. రామ్ షెఫర్డ్, ప్రముఖులు ,వట్టె జానయ్య యాదవ్‌( సూర్యాపేట కంటెస్టిన్ అభ్యర్థి ), క్యామ మల్లేష్ ( కంటెస్టిన్ ఎంపి ), గడ్డం శ్రీనివాస్ యాదవ్‌‌ , తెలంగాణ ఉద్యమ కారులు ప్రృద్విరాజ్ యాదవ్, MB క్రిష్ణ యాదవ్‌ , కన్నెబోయిన రాము యాదవ్, సభాద్యక్షులు నూకల మధు యాదవ్, మన అశోక్ యాదవ్, ఆర్ ఎన్ శంకర్, ఓయు జెఏసి నాయకులు నోముల శేషు యాదవ్ , బారి అశోక్ యాదవ్, కడారి రమేష్ యాదవ్, శ్రవణ్ యాదవ్, సిద్ధు యాదవ్, సాయి యాదవ్, యాదవ్ ఎంప్లయిస్, ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.