సెల్ఫీ వీడియోతో లింగంపల్లి బాలరాజ్

– మా ఉసురు తగిలి నాశనం అవుతావు రసమయి.

– గునుకుల కొండాపూర్ సర్పంచ్ భర్త లింగంపల్లి బాలరాజ్ ఆవేదన
– సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సెల్ఫీ వీడియో
నవతెలంగాణ – గన్నేరు వరం
గత నాలుగున్నర సంవత్సరాలుగా తమను మానసికంగా వేధించి, బిల్లులు రాకుండా అడ్డుకొని ఆర్థికంగా నష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన అనుచరులకు నా ఉసురు తగులుతాది అనే సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తన కున్న 30 గుంటల భూమిని అమ్ముకుని కరీంనగర్ కు పోయి బట్టలు ఉతుక్కొని బతికే విధంగా చేసిన నీకు మా ఉసురు తప్పక తగులుతుందని, ముందు ముందు మరింత అనుభవిస్తావని ఆవేదన పడుతు మాట్లాడిన గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి భర్త లింగంపల్లి బాలరాజు వీడియో ఆ గ్రామ సోషల్ మీడియా గ్రూపులో చెక్కర్లు కొడుతుంది. ఆదివారం ఎమ్మెల్యే రసమయి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ నాయకులు హద్దు మీరి మాట్లాడకూడదని హెచ్చరించిన తరుణంలో ఈ వీడియో సర్పంచ్ భర్త గ్రూపుల్లో షేర్ చేయడంతో మండల వ్యాప్తంగా రసమయి అణిచివేత ధోరణి, అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలు వెలుగు లోకి వస్తున్నాయని, ప్రజలు అందుకే మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ తన అనుచరులను వెంటవేసుకొని ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మారి ప్రజల శ్రేయస్సుకు పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు..