
మండలంలోని గాదంపల్లి గ్రామంలో గురువారం మాల, మాల ఉపకులాల ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన మాల,మాల ఉపకులాల సింహాగర్జన సన్నాహక సమావేశంలో భాగంగా కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భూపాలపల్లి జిల్లా కో-కన్వీనర్ మండల రాహుల్, మండల కోఆర్డినేటర్ పసుల పోచయ్య తో పాటు మంథని డివిజన్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ కో ఆర్డినేటర్స్ ఆర్ల జ్ఞాని, జంజర్ల సుదర్శన్, మంథని జిబిఎస్ డి ఉపాధ్యక్షులు రావుల నాగేష్ , గాదంపల్లి గ్రామ యువ నాయకులు దాసరి వెంకటి మందల సుమన్, మండల శ్యామ్, మందల ప్రవీణ్ పాల్గొన్నారు.