
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజా ఉపయోగ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో లయన్స్ క్లబ్ బేష్ గా ఉన్నాయని జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు.బుధవారం బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక నర్మధ గార్డెన్ యందు సుమారు వంద 106 మంది గర్భిణీ మహిళలకు మహా సీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.లయన్స్ క్లబ్ వారు సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవంగా సీమంతం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని.. మున్ముందు క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, సర్పంచ్ మంజుల ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రాజిరెడ్డి, ఉప గవర్నర్లు వెంకటేశ్వర్ రావు,కోదండరాం, మల్టిపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు ఆర్పీ భరత్, శ్రీనివాస్, సత్తయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్, రాజయ్య,ఆశా కార్యకర్తలు హజరయ్యారు.