
లయన్స్ ఇంటర్నేషనల్ పవర్ రీజియన్ 7 మీట్ కార్యక్రమాన్ని నగరంలోని అమృత గార్డెన్స్ లో రీజియన్ చైర్మన్ లయన్ అనిల్ పాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ సహారా సేవలను గుర్తించి 12 ఎక్స్లెంట్ అవార్డులను క్లబ్ డి ఎస్ కి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యానర్ ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ బహుమతులను అందించారు. మల్టిపుల్ జిఎల్టిఏ లీడర్ ప్రకాష్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ సూర్య రాజ్, పూర్వపు జిల్లా గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. అవార్డులు క్లబ్ కి రావడంతో క్లబ్ జిల్లా కార్యదర్శి లయన్ ఉదయ సూర్య భగవాన్ సంతోషం వ్యక్తపరిచారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవలు కొనసాగించి మరెన్నో పథకాలు సాధించే విధంగా ముందుకు సాగుతామన్నారు.