లయన్స్ సేవలను మరింత విసృతపర్చాలి: పి లక్ష్మి..

Lions services should be expanded: P Lakshmi..నవతెలంగాణ – డిచ్ పల్లి
లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాదు నేత నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు.క్లబ్ అద్యక్ష కార్యదర్శులు కైరంకొండ మురళి, గంగరాజు, కోశాదికారి రవిందర్ లతో పాటు నూతన కార్యవర్గంచే లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ బసవేశ్వర రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ లక్ష్మి ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ లు ముందుకు సాగుతున్నాయన్నారు. కరోనా సమయంలో లయన్స్ క్లబ్ లు విశేష సేవలందించాయని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్లు డి.పెంటయ్య, గంధాని శ్రీనివాస్,రీజియన్ చైర్మెన్ అనిల్ పటేల్,రీజియన్ కార్యదర్శి ద్వారకాదాస్ అగర్వాల్,కో ఆర్డినేటర్ డి.యాదగిరి,జోన్ చైర్మెన్ ఎస్.తులసీదాస్, నేత క్లబ్ ప్రతినిధులు అంకం లక్ష్మణ్, ధర్మరాజు,ప్రవీణ్ , పుల్గం హన్మాండ్లు,రాపెల్లి గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు.