నారాయణగూడలో మద్యం సీసాలు స్వాధీనం…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారి నుండి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ ఐ ఖజామొయినుద్దీన్ తెలిపారు. బుధవారం నారాయణగూడ మై పిల్ హోటల్ పక్క గల్లీలో కొందరు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వివిధ రకాల కు చెందిన మద్యం 92 క్వార్టర్ సీసాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.