నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
లిక్కర్ స్కామ్ లో నిందితురాలైన ఎమ్మెల్సీ కవిత ను కఠినంగా శిక్షించాలని బీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐలేస్ యాదవ్ ఒక ప్రకటన డిమాండ్ చేశారు. మహిళ అయి ఉండి లిక్కర్ స్కాం చేయడం దారుణం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కావడం వల్ల కవితను అరెస్ట్ చేయడం లేదన్నారు. కవితను అరెస్ట్ చేస్తేనే బిజెపి బిఆర్ఎస్ ఒకటి కాదని అర్థమవుతుందన్నారు . లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన కవితను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.