
నవతెలంగాణ – పెద్దవూర
లబ్ధిదారులు జాబితా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజాపరిషత్ కార్యాలయం లో గ్రామసభలపై నిర్వహించిన రివ్యూ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా,కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి రూ.12,000 వేల, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.వ్యవసాయయోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించబడిందని తెలిపారు. రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి, అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గ్రామ సభకు హాజరుకాలేనివారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చుని తెలిపారు. వాటిని కూడా పరిశీలించి తరువాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయని అన్నారు. గత గ్రామసభలో గ్రామంలో ఇండ్లు లేని వారినుంచి దరఖాస్తులు స్వీకరించారని అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని అన్నారు. 40 ఏళ్ల లోపు యువవితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు. అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ట్రాన్స్ జెండర్స్ లను ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్,తహసీల్దార్ సరోజ పావని, ఎంపీడీఓ సుధీర్ కుమార్, ఏఓ సందీప్ కుమార్, ఆర్ డబ్ల్యూఏఈ దీక్షిత్ కుమార్, ఆర్ఐ హబీబ్, సూపరెండెంట్ హఫీజ్ ఖాన్,పంకజ్ రెడ్డీ,కార్యదర్శులు శ్యామ్ సుందర్ రెడ్డీ, నాగిరెడ్డి,ముంతాజ్, రవీందర్ రెడ్డీ, కార్తీక్ రెడ్డీ తదితరులు పాల్గొన్నారు.