రోజూ ఉదయాన్నే చాలామంది బద్దకంగా నిద్రలేస్తారు. లేచీ లేవగానే.. ఆరోజు చేయబోయే పనులను గుర్తుకు తెచ్చుకుంటే మరింత ఒత్తిడికి గురవుతారు. ఎంత ప్రణాళికలు వేసుకుని నిద్ర లేచినా.. మూడ్ సరిగ్గా ఉండదు. ఆ సమయంలో మీకు నచ్చిన పాటలు వింటే.. ఉల్లాసంగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొద్దున్నే నిద్రలేవగానే.. ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని కాఫీ తాగుతూ.. ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడం.. వాటికి రిప్లయి ఇవ్వడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ పనులతోపాటు మీకిష్టమైన సంగీతం వింటే ఆరోజంతా ఎనర్జీగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
– మీరు ఉదయాన్నే ప్రశాంతంగా కొంచెంసేపు సంగీతం వింటే మానసిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోజంతా మీరు సానుకూల దక్పథంతో వ్యవహరిస్తారు.
– పొద్దున్నే సంగీతం వింటే.. ఒత్తిడిని తగ్గిస్తుంది. సంగీతం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గిస్తుంది.
– మ్యూజిక్ మీ పనిపై ప్రభావం చూపుతుంది. ఏకాగ్రతతో పనిచేసేందుకు దోహదపడుతుంది. దీనివల్ల పని మరింత మెరుగ్గా చేయగలుగుతారు.
– హదయ స్పందన రేటు పెరుగుతుంది.
– సంగీతం మీ సజనాత్మకతకు ప్రేరణ కలిగిస్తుంది.
కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆవిష్కరణలకు ప్రేరేపిస్తుంది.