అనాజిపూర్ పాఠశాలలో అక్షరాభ్యాసం..

నవతెలంగాణ – రాయపోల్: అనాజీ పూర్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం ద్వారా విద్యార్థులకు ఓనమాలు నేర్పించడం జరిగిందని ఎంపీడీవో మున్నయ్య, సర్పంచ్ శోభారాణి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం అనాజిపూర్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో అనుభవంలేని ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేస్తారని, అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులకు దిగుబండగా విద్యాభ్యాసం ఉంటుందన్నారు. గ్రామాలలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోకే విద్యార్థులను పంపించాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్, ఉపాధ్యాయులు కనకయ్య, పంచాయతీ కార్యదర్శి జావేద్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.