సాహిత్య విమర్శకు వస్తు,శిల్పాలు రెండూ అవసరమే

– దార్ల వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
సాహిత్య విమర్శ కుడికి ఒక దృక్పథం ఉంటుందనీ, ఆ దృక్పథం రచనలోని ఉత్తమ లక్షణాలను నిరోదించేలా ఉండ కూడదని, వక్ర భాష్యా లిచ్చేలా మారకూడదని, సాహిత్య విమ ర్శకు వస్తు,శిల్పాలు రెండూ అవసరమేనని భావించిన సాహిత్య విమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య అని హెచ్‌సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం వారు ఆదివారం అరసం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్‌ అధ్య క్షతన నిర్వహించిన అంతర్జాల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని ఆచార్య దార్ల వెంకటే శ్వరరావు ‘అభ్యుదయ సాహిత్య విమర్శకుడుగా వల్లంపాటి’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రాచ పాళెం చంద్ర శేఖరరెడ్డి, డా.పెనుగొండ లక్ష్మీ నారాయణ, అరసం సోషల్‌ మీడియా కార్య నిర్వహక కార్యదర్శి ఎఎమ్‌ఆర్‌ ఆనంద్‌, ప్రముఖ రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి, డా ఉమేశ్‌, డా.పెద్దింటి ముకుందరావు, డా. బాసెట్టి లత, డా.రామ్‌ ప్రసాద్‌ నలసాని, కేపీ. యు. అప్పల రాజు, ఎం.జయదేవ్‌, సుబ్రహ్మణ్యం ఉన్నారు.