డా.రాయారావు సూర్యప్రకాశ్ రావుకు కాళోజీ పురస్కారం
తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కతిక సంస్థ కాళోజీ పురస్కారానికి రచయిత డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో ఈ నెల 22వ తేదీన జరిగే సభలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి పురస్కారానికి ప్రముఖ కవయిత్రి వీణారెడ్డి ఎంపికయ్యారు. ఈ సభకు ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప, డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి, మద్ది అనంత్ రెడ్డి, డా.నలవోలు నరసింహా రెడ్డి, డా.వంగీపురం శ్రీనాథాచారి, లక్ష్మణ్ గౌడ్, పాకాల లక్ష్మి రెడ్డి అతిథులుగా పాల్గొంటారు.
– శ్రీమతి రావూరి వనజ, శ్రీమతి జి.శాంతారెడ్డి
సురవరం ప్రతాపరెడ్డి గారిపై కవితలకు ఆహ్వనం
ఆధునిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి మూర్తిమత్వం పై కవితలను ఆహ్వానిస్తున్నాం. ఇట్టి కవితలు అక్టోబర్ 30.2024 వ తేదివరకు పంపగలరు. కవితలు పంపవల్సిన వాట్సాప్ నెంబర్ 9492765358 ఙaఅaజూa్‌శ్రీaరబbbaఱaష్ట్ర1972 ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ కు పంపగలరు. మెరుగైన కవితలను నవంబర్ 2024 లో సంకలనంగా ముద్రిస్తామని తెలిపారు.
– వనపట్ల సుబ్బయ్య, 9492765358
తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాలు
తాటికొండాల నరసింహారావు సతీమణి శ్రీమతి తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాల సభ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యం లో సెప్టెంబర్ 21 సాయంత్రం 6 గంటలకు దొడ్డి కొమరయ్య హాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగం పల్లి హైదరాబాద్ నందు జరుగుతుంది. 2023 వ సంవత్సరానికి గాను డాక్టర్ యెన్. గోపి, 2024 వ సంవత్సరానికి ప్రసేన్ పురస్కారాలను స్వీకరిస్తారు. ప్రముఖ కవులు నందిని సిధా రెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, గౌరీశంకర్, సీతారాం, యాకూబ్, ఆనందా చారి, యెస్. రఘు సభలో ప్రసంగిస్తారు.
– వంశీకష్ణ, 95734 27422