సోమేపల్లి వెంకటసుబ్బయ్య స్మారక సంకలనానికై రచనలకు ఆహ్వానం
సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి వర్థంతి సందర్భంగా వెలువరించబోయే ప్రత్యేక సంకలనానికై రచనలను ఆహ్వానిస్తున్నాం. సోమేపల్లితో వున్న అనుబంధాల్ని, సందర్భాలను వ్యాసాలుగా, కవితలుగా చేసిన రచనలను, ఫొటోలను నవంబరు 20 లోపు ఈమెయిల్: svsomepalli@gmail.com లేదా 8074779202 నెంబరుకు వాట్సాప్ లేదా రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 చిరునామాకు పంపగలరు.
– సోమేపల్లి లిటరరీ ఫౌండేషన్
నవంబర్ 3న కవిసమ్మేళనం
తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, తెలుగు భాషా సంస్కృతి శాఖ సంయుక్త నిర్వహణలో నవంబర్ 3న మధ్యాహ్నం 2గం.లకు రవీంద్ర భారతిలో కవి వారం-కవిత్వ తరగతి, కవి సమ్మేళనం జరుగుతుంది. ఈ సభలో నందిని సిధారెడ్డి ‘వర్తమాన జీవితం – వచన కవిత నిర్మాణం’ అంశం మీద ప్రసంగిస్తారు. కందుకూరి శ్రీరాములు, మామిడి హరికృష్ణ, బెల్లంకొండ సంపత్ కుమార్ పాల్గొంటారు. 39 మంది కవులు తమ కవిత గానాన్ని వినిపిస్తారు.
– కందుకూరిశ్రీరాములు, అధ్యక్షుడు, తెలంగాణ రచయియల సంఘం
మండల స్వామి సంస్మరణ సభ
దివంగత కవి రచయిత డా.మండల స్వామి సంస్మరణ, మిత్రులచే స్వామి కవిత్వ పఠనం ఈ నెల 30న సాయంత్రం 6.00 గం.లకు హైదరాబాద్ కవుల వేదిక సమావేశ మందిరం, విజయశ్రీ కాలనీ కమ్యూనిటీ హాల్, వనస్థలిపురంలో జరుగుతుంది. మండల స్వామి మిత్రులందరికీ ఆహ్వానం.
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183