సాహితీ స‌మాచారం

తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్‌ 8వ తేదీ ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సభలో చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్‌ విసి సూర్య ధనుంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సభలో కె. ఆనందాచారి, పి.శ్రీనివాస్‌ గౌడ్‌, సి.హెచ్‌.ఉషారాణి, చరణ్‌ పరిమి, తంగిరాల చక్రవర్తి, ఏబూషి నరసింహ, నస్రీన్‌ఖాన్‌, పాలపర్తి సంధ్యారాణి తదితరులు పాల్గొంటారు. కవితల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది.
– శరత్‌ సుదర్శి,7386046936
వెలమల సిమ్మన్నకి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కషి సల్పుతున్న పరిశోధక రచయితకు ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2024కి ప్రముఖ పరిశోధకులు, రచయిత ఆచార్య వెలమల సిమ్మన్నకు ప్రకటించింది. నవంబర్‌ 17వ తేదీ సాయంత్రం విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్డులోగల ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో రచయితని సత్కరించడం జరుగుతుంది. ఈ సభలో డా. చిల్లర భవానీదేవి, డా. పాపినేని శివశంకర్‌, కె.రమాదేవి తదితరులు పాల్గొంటారు.
– చలపాక ప్రకాష్‌
ఖమ్మం ఈస్తటిక్స్‌ 2024 సాహితీ అవార్డుల ఫలితాలు
ఖమ్మం ఈస్తటిక్స్‌ సాహితీ అవార్డుల ఫలితాలు ప్రకటించారు. కవిత్వం విభాగంలో జూకంటి జగన్నాధం కవితా సంపుటి ‘ఒక కప్పు చారు నాలుగు మెసేజ్‌లు’, ప్రత్యేక ప్రశంసకు రాళ్ళబండి శశిశ్రీ కవితా సంపుటి ‘అనుమంద్రం’, తెలుగు వెంకటేష్‌ కవితా సంపుటి ‘కబోధి చేపల కబుర్లు’ ఎంపికయాయి. ఎన్‌. గోపి కవితా సంపుటి ‘క్రియ ఒక జీవన లయ’కు విశిష్ట పురస్కారం, కథల విభాగంలో ఉత్తమ కథగా కె.వి.మన్‌ ప్రీతమ్‌ ‘నూరేళ్లు మోసే తల్లికథ’ ద్వితీయ ఉత్తమ కథగా సయ్యద్‌ గఫార్‌ ‘న్యూ బాబాయిజం’, తతీయ ఉత్తమ కథగా కరీం ‘ఝాజా’ గెలుచుకున్నాయి. సంపుటిగా ప్రచురించే కథలు… డీ గాడు (జి ఉమామహేశ్వర్‌), ‘ఏ రూమ్‌ అఫ్‌ దెయిర్‌ ఓన్‌ (సింహ ప్రసాద్‌), బలి (వేల్పుల నారాయణ), గోడ (రాజా నరసింహ), అమ్మోరి భ్రమరాంబ (రోహిణి వంజారి), ఆమె చెప్పిన ఆమెకథ (సుగుణారావు), మనసు మరచి పోయింది (శాంతి ప్రబోధ), ప్రపోసల్‌ (పి కిషన్‌), సాగరాలు దాటి (శివ ప్రసాద్‌). డిసెంబర్‌ 15వ తేదీన ఖమ్మంలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతి తో పాటు షీల్డ్‌ అందించనున్నట్టు కమిటీ ప్రకటించింది.
– రవి మారుత్‌, ఖమ్మం ఈస్తటిక్స్‌
సాహితీకిరణం కథలపోటీలు
సాహితీకిరణం మాసపత్రిక వివిధ సంస్థల సౌజన్యంతో విడదల నీహారికా ఫౌండేషన్‌ సంక్రాంతి కథలపోటీ, -2025, ముట్టూరు కమలమ్మ ఫౌండేషన్‌ చిన్నకథలపోటీ-2024 నిర్వహిస్తున్నది. కథలు పోస్ట్‌/కొరియర్‌ ద్వారా మాత్రమే పంపాలి. డిటిపిలో కథ 3 పేజీలు, చిన్న కథ 2 పేజీలు వుండాలి. నవంబర్‌ 30 లోపు సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌-500102 చిరునామాకు పంపాలి. వివరాలకు 9490751681.