నిర్వాణ’ నవలపై వ్యాస రచనా పోటీ
సద్ధమ్మ సాహితి ఆధ్వర్యంలో డాక్టర్ బండి సత్యనారాయణ గారి బౌద్ధ చారిత్రక నవల (లతా రాజా ఫౌండేషన్ వారి ప్రచురణ) ‘నిర్వాణ’పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రథమ, ద్వితీయ, తతీయ, మరియు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. వ్యాసాలు nirvaana2024@gmail.com మెయిల్‌కి పిడిఎఫ్ డ పిఎండి (అను 7, ప్రియాంక ఫాంట్, సైజ్ 16) లో ఫైల్స్‌ని 15, డిసెంబర్ 2024 లోపు పంపాలి. – సద్ధమ్మ సాహితి, 9618598847
మలిదశ తెలంగాణ ఉద్యమ కథలకు ఆహ్వానం
తెలంగాణ ఏర్పాటై పది సంవత్సరాలు నిండిన సందర్భాన మలిదశ ఉద్యమంలో పెల్లుబికిన సజనను ఈ తరం యువరచయితలకు, కవులకు అందుబాటులోకి తేవాలని తెలుగు పరిశోధక మండలి’ సంకల్పించినది. మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో (1989- నుండి 2014 వరకు) వచ్చిన కథలను సంకలనంగా తీసుకురావడానికి మీ పరిశీలనలో ఉన్న కథలను, మీరు స్వతహాగా రాసిన ఉద్యమకాలంలోని కథలను telanganatpm@gmail.com మెయిల్ కి పంపగలరని మనవి. ఆఖరు తేదీ: 31, డిసెంబర్, 2024 – డా. నర్రా ప్రవీణ్ రెడ్డి, 8179179183