‘ధిక్కార’ మహాత్మాపూలే స్ఫూర్తి కవిత్వం ఆవిష్కరణ
ధిక్కార మహాత్మా ఫూలే స్ఫూర్తి కవిత్వం ఆవిష్కరణ సభ ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నది. నెలపొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక, భాషా సాంస్కతిక శాఖా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు డా||సంగిశెట్టి శ్రీనివాస్, బుర్ర వెంకటేశం, గోరటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్, జి.లక్ష్మీనరసయ్య, డా||మామిడి హరికృష్ణ, డా||బి.ప్రసాదమూర్తి, డా||ఎ.జయంతి, డా||పసునూరి రవీందర్, వనపట్ల సుబ్బయ్య, ఆమ్‌గోత్ వెంకట్ పవార్, పి.వహీద్ ఖాన్, కందికొండ మోహన్, కల్వకోల్ మద్దిలేటి హాజరవుతారు. – వనపట్ల సుబ్బయ్య
ఖమ్మం ఈస్థటిక్స్ -2024 పురస్కారాలకు ఆహ్వానం!
ఖమ్మం ఈస్ధటిక్స్ మూడు ఉత్తమ కథలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, ఉత్తమ కవితా సంపుటి కి 40 వేల రూపాయల నగదు బహుమతులు, పురస్కారాలు, సత్కారం ఇవ్వడమే కాక మరి కొన్ని కథలను కూడా సాధారణ ప్రచురణకు ఎంపిక చేసి పుస్తకంగా అచ్చువేస్తుంది. కవితా సంపుటిలో 25 కవితలకు తగ్గకుండా, 2023 ఏప్రిల్ – 2024 మార్చి నడుమ ప్రచురితమై వుండాలి. రచనలు ఏవైనా యూనికోడ్ సాఫ్ట్ కాపీని, నాలుగు ప్రతులు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఖమ్మంలో నవంబర్ నెల లో జరిగే వేడుకలో అవార్డుల ప్రదానం ఉంటుంది. ఈ అవార్డుల కోసం కథలు, కవితా సంపుటులను ఆగస్ట్ 31, 2024 లోపు ‘ఖమ్మం ఈస్థటిక్స్, హార్వెస్ట్ స్కూల్, 5-7-200/11, పాకబండ బజార్, ఖమ్మం – 507002. Khammamaesthetics@gmail.com’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9849114369.