వర్తన అయిదవ సమావేశం
వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 5వ సమావేశం ఈ నెల 25న సా|| 6 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతుంది. ‘తెలంగాణ నాటకం తీరుతెన్నులు’ అంశంపై తాటికొండాల నరసింహారావు ప్రసంగిస్తారు. డా. రూప్ కుమార్ డబ్బీకార్‌్ పాల్గొంటారు.
– ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
పెందోట పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, కవిసమ్మేళనం
శ్రీవాణి సాహిత్య పరిషత్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు సిద్ధిపేట శివానుభవ మండపంలో పెందోట సాహిత్య, బాలసాహిత్య పురస్కారాలు అందజేస్తారు. అదే వేదికపై కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ‘బాలకథల సెలిమె, ఉడుతా ఓ బుడుతా…, సాహిత్య పరిమళాలు’ పుస్తకాల ఆవిష్కరణ వుంటుంది.