సాహిత్య స‌మాచారం

డా||అమ్మంగి వేణుగోపాల్‌కు మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ నేషనల్‌ అవార్డు ప్రదానం
సిటీకాలేజ్‌ మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ నేషనల్‌ అవార్డును డా|| అమ్మంగి వేణుగోపాల్‌కు ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సిటీ కాలేజ సమావేశమందిరంలో ప్రదానం చేస్తారు. ఈ సభలో ఆచార్య పి.బాలభాస్కర్‌, డా||ముదిగంటి సుజాతారెడ్డి, డా||యాకూబ్‌, వాహెద్‌, డా||ఏలూరి యాదయ్య, డా||జె.రత్న ప్రభాకర్‌, డా||విప్లవ్‌ దత్‌ శుక్లా, డా||కోయి కోటేశ్వరరావు పాల్గొంటారు.
సుఖమంచి కోటేశ్వరరావుకు తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక రంగస్థల పురస్కారం
ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు సుఖమంచి కోటేశ్వరరావుకు 25వ తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక రంగస్థల పురస్కారాన్ని జులై 21 సాయంత్రం 5.00 గంటలకు ఠాగూర్‌ గ్రంథాలయం, విజయవాడలో ప్రదానం చేయనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొంటున్నారు. 25 మంది సాహితీవేత్తలకు, కళాకారులకు సత్కారం ఉంటుంది.
– తంగిరాల ట్రస్టు చైర్మెన్‌ తంగిరాల చక్రవర్తి