సాహితీ వార్తలు

‘రహదారి’ కవితా సంపుటి ఆవిష్కరణ, అంకితోత్సవం
ఈ నెల10వ తేదీ సాయంత్రం విజయా హైస్కూల్‌ ఆర్మూర్‌లో కొరుప్రోలు హరనాథ్‌ కవితా సంపుటి ‘రహదారి’ ఆవిష్కరణ, అంకితోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నటి శ్రీమతి రాజశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కవితా సంపుటిని విజయా విద్యా సంస్థలు, అమతలత అపురూపా అవార్డ్స్‌ అధినేత్రి డా|| అమృతలతకి ‘రహదారి’ని అంకింతం ఇస్తారు. ఈ కార్యక్రమంలో రాజశ్రీ, డా||అమృతలత, వి.పి.చందన్‌ రావు, నెల్లుట్ల రమాదేవి, దేవలపల్లి సునంద, కవిత తదితరులు పాల్గొంటారు.
– దేవలపల్లి సునంద
‘చాటువులు-చమత్కారాలు-సమాలోచన’ మూడు రోజుల జాతీయ సదస్సు
ఏ.వి. ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల తెలుగుశాఖ, యాద శంకర మెమోరియల్‌ ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో ‘చాటువులు-చమత్కారాలు- సమాలోచన’ జాతీయ సదస్సు ఈ నెల 7,8,9 తేదీల్లో జరుగుతుంది. ఈ సదస్సు 7వ తేది ఉదయం 10 గం.లకు ఏ.వి. కళాశాల ఆడిటోరియంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ తనికెళ్ల భరణి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య సి. కాశీం పాల్గొంటారు. ఈ సదస్సులో 42 మంది పరిశోధకులు పత్రసమర్పణ చేస్తున్నారు. 9వ తేది మధ్యాహ్నం సమాపనత్సవానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య సాగి కమలాకరశర్మ పాల్గొంటారు. ఈ సదస్సులో ఆచార్య కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొంటారు.
– డా.వై.సత్యనారాయణ