తెలుగు సాహితీవనం కథా పురస్కారం -2024
తెలుగు సాహితీవనం కథాపురస్కారం కొరకు కథలను ఆహ్వానిస్తున్నది. నలుగురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 2,116 చొప్పున నగదు బహుమతితో పురస్కార ప్రదానం ఉంటుంది.హైదరాబాద్ లో జరిగే తెలుగు సాహితీవనం వార్షికోత్సవ సభలో విజేతలకు పురస్కారం అందచేస్తారు. కథలు వర్తమాన పరిస్థితులు, మానవ సంబంధాల సాంఘిక ఇతివత్తంతో 1200 పదాల కంటే మించరాదు. కథను వర్డ్‌లో యూనికోడ్ లో టైప్ చేసి టెక్స్ట్ రూపం లో, హామీ పత్రం జత చేసి sahitivanam82@gmail.com కు మెయిల్ చేయాలి. కథలను పంపటానికి చివరి తేదీ 30.12.2023. వివరాలకు -9490805404
అబద్ధం ఆవిష్కరణ
ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘అబద్ధం’ పుస్తకావిష్కరణ విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో జరుగుతుంది. ఈ సభలో బండ్ల మాధవరావు, సీతారాం, ప్రసేన్, శ్రీరాం, మారుతీ పౌరోహితం, అనిల్ డ్యానీ పాల్గొంటారు.