సాహితీ వార్తలు

17న జి.ఉమామహేశ్వర్‌ కథల సంపుటి పరిచయ సభ
ప్రముఖ రచయిత జి. ఉమామహేశ్వర్‌ కథల సంపుటి – నెమలీకలు నెమరువేతలు – పరిచయ సభ 17 డిసెంబర్‌ 2023 ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో జరుగుతుంది. సభకు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షత వహిస్తారు. సభలో సమ్మెట ఉమాదేవి, సుధాకర్‌ నీల్‌, కోడూరి విజయకుమార్‌, మామిడి హరికష్ణ, గుడిపాటి ప్రసంగిస్తారు.
– పాలపిట్ట బుక్స్‌

‘నానీల సుగంధం’ ఆవిష్కరణ

డాక్టర్‌ గిన్నారపు ఆదినారాయణ రచించిన నానీల సుగంధం పుస్తకావిష్కరణ ఈ నెల13వ తేదీ సాయంత్రం 5.30 నిమిషాలకు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభలో ఆచార్య ఎన్‌.గోపి, డా||ఎస్‌.రఘు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా||పి.లలితవాణి, డా||యం.దేవేంద్ర, డా||యస్‌.చంద్రయ్య పాల్గొంటారు.
– ఆదినారాయణ

‘తెలకోవెల’ పరిచయం – చర్చా కార్యక్రమం
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథా సంపుటి ‘తెలకోవెల’ పరిచయం – చర్చా కార్యక్రమం ఈ నెల 17వ తేదీ పలమనేరు గంగవరం సాయిగార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కె.పి.అశోక్‌కుమార్‌, రాము ఇటిక్యాల కెయస్వీ, ఆముదాల మురళి, ఎమ్మార్‌ అరుణకుమారి, గంటా మోహన్‌, పల్లిపట్టు నాగరాజు, దొర్నాదుల సిద్ధారా, వి.గురురాజారావు, భగవద్గీత బాలాజీ పాల్గొంటారు.

త్రో మై విండో కార్యక్రమం
సాహిత్య అకాడెమీ, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్‌ 16వ తేదీ సా.6.00 గం.లకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రముఖ తెలుగు, సంస్కృత పండితులు, నిఘంటు కర్త ఆచార్య రవ్వా శ్రీహరిపై ఆచార్య కె.యాదగిరి ప్రత్యేక ప్రసంగం చేస్తారు. నిర్వహణ: డా.ఎస్‌.రఘు. – ఆచార్య సి.మృణాళిని

కథా సంపుటాలకు ఆహ్వానం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారం 2023 కొరకు 2023 వ సంవత్సరంలో ముద్రితమైన కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాము. మూడేసి ప్రతులను జనవరి,31,2024 లోపు పంపగలరు. బహుమతి పొందిన కథా సంపుటికి నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున ఏప్రిల్‌ లో పదివేల నగదు. పురస్కారం, జ్ఞాపిక ప్రదానం జరుగును. ప్రతులు పంపవల్సిన చిరునామా : అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, ఇంటి నెం. 15- 120/4 /1, రహత్‌ నాగర్‌ కాలనీ, నాగర్‌ కర్నూల్‌ – 509209, తెలంగాణ రాష్ట్రం.