సాహితీ వార్తలు

19న విల్సన్‌రావు కవితా సంపుటి ఆవిష్కరణ
ప్రముఖ కవి విల్సన్‌రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ ఆవిష్కరణ సభ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6గంటలకు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో జరుగుతుంది. సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్‌, కె. శివారెడ్డి, కె. శ్రీనివాస్‌, కోయి కోటేశ్వరరావు, మామిడి హరికృష్ణ, కవి యాకూబ్‌, ఎం. నారాయణశర్మ, ఎం.వి.రామిరెడ్డి, జెల్ది విద్యాధర్‌ రావు పాల్గొంటారు.
– పాలపిట్ట బుక్స్‌
‘దురస్తు’ ఆవిష్కరణ
‘దురస్తు’ తెలంగాణ కథ – 2022 ఆవిష్కరణ సభ ‘నల్గొండ కథా పాఠశాల’ ఆధ్వర్యంలో ఈ నెల 24న నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల, అల్యూమిని హాల్‌లో జరుగుతుంది. సభాధ్యక్షులుగా డా| సంగిశెట్టి శ్రీనివాస్‌ వ్యవహరిస్తారు. బి. నర్సింగ రావు ‘దురస్తు’ను ఆవిష్కరిస్తారు. మేరెడ్డి యాదగిరి రెడ్డి, డా||పగడాల నాగేందర్‌, పెరుమాళ్ళ ఆనంద్‌, డా||ఉప్పల పద్మ, డా||వెల్దండి శ్రీధర్‌, మోతుకూరి శ్రీనివాస్‌ పాల్గొంటారు.
-‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం.