సాహితీ వార్తలు

మద్దూరి నగేష్‌ బాబు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ
మద్దూరి నగేష్‌ బాబు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 10వ తేది సాయంత్రం 4 గం లకు గుంటూరు, గుర్రం జాషువ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సభలో మద్దూరి విజయశ్రీ, శిఖామణి, జి .లక్ష్మీనరసయ్య, ప్రసాదమూర్తి, చల్లపల్లి స్వరూపరాణి, యం.యం.వినోదిని, కత్తి కల్యాణ్‌, ఖాజా, కోయి కోటేశ్వరరావు, జి.వి.రత్నాకర్‌, నూకతోటి రవికుమార్‌, కాకాని సుధాకర్‌ తదితరులు వక్తలుగా పాల్గొంటారు.
– పల్నాటి శ్రీరాములు
పుస్తక ప్రదర్శనకు సాహిత్య ఆహ్వానం
ఫిబ్రవరి 9 నుండి జరిగే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో తెలంగాణకు సంబంధించిన సాహిత్యాన్ని పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించేందుకు రచయితలు వారి పుస్తకాలను తెలంగాణ పబ్లికేషన్స్‌ కార్యాలయానికి పంపించగలరు.
– కోయ చంద్రమోహన్‌, 863997216
వచన కవితా సంపుటాలకు ఆహ్వానం
‘వెన్నెల సాహితీ పురస్కారం-2023’ కొరకు..2023 సం||లో ప్రచురించిన వచన కవితా సంపుటాలు నాలుగు (4) ప్రతులను ఈ నెల 29 లోపు ‘కొండి మల్లారెడ్డి, ఇం.నెం.19-61/5/సి, విద్యా నగర్‌, రోడ్‌.నెం.3, మిలన్‌ గార్డెన్‌ రోడ్‌. కుశాల్‌ నగర్‌, సిద్ధిపేట, 502103 చిరునామాకు పంపగలరు. సెల్‌ : 9652199182.
– పర్కపెల్లి యాదగిరి