సాహితీ వార్తలు

17 న వర్తన రెండవ సమావేశం
సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రెండవ సమావేశం ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది. ఈ సమావేశంలో ‘కవిత్వ వాస్తవికత’ అంశంపై కవి సిద్ధార్థ ప్రసంగిస్తారు. డా|| రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.
– ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌
ఉగాది కవితల కదంబం
అఖల భారతీయ భాషా సాహిత్య సమ్మెళన్‌ (భూపాల్‌) తెలంగాన శాఖ, హైదాబాదు ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ‘ఉగాది’ సందర్భంగా కవి సమ్మేళనం, కవితా కదంబం గ్రంధావిష్కరణ సభ నిర్వహిస్తారు. ఇందుకోసం కవులు, కవియిత్రులు, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన సభ్యులు తమ కవితలను (20 లైన్లలో) ముందుగా ఈ క్రింది చిరునామాకు పంపగలరు. ఈ కవితలను కవితా కదంబంగా ముద్రణ చేస్తాము. కవులు తమ కవితలను మార్చి 20వ తేదీలోపు ఆచార్య కడారి సత్యమూర్తి, అధ్యక్షులు, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ ఇ. నెం. 13-20-21, శ్రీ కోదండరామ్‌ నగర్‌, గడ్డిఅన్నారం, హైదరాబాద్‌-60, సెల్‌ : 9849320610 చిరునామాకు పంపాలి. ఎంపికయిన కవితలను కవులు, కవియిత్రులు ఉగాది కవి సమ్మేళనంలో చదవొచ్చు. చదివిన వారికి ప్రశంసాపత్రం, సత్కారం, ఉగాది కవితల సంచిక ప్రధానం వుంటుంది.