జాతీయస్థాయి కవితల పోటీ
అల్వాల బాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కవితలకు ఆహ్వానం పలుకుతున్నారు. 20 – 25 లైన్లకు మించని కవితలను ఆగస్టు 20 రాత్రి 12 గంటల లోపు పంపాలి. వివరాలకు : శ్రీమతి విజయలక్ష్మి వడ్డేపల్లి, 6303732862.
నవలల పోటీకి ఆహ్వానం
అరసం వరంగల్ వారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2024 కు గాను నవలలను ఆహ్వానిస్తున్నారు. 2020 జూలై నుండి 2024 జూన్ వరకు ప్రచురించిన మొదటి ముద్రణ నవలలను 4 ప్రతులను ఆగస్టు 31 లోపు ‘మా నిది,ó ఇంటి నెంబర్ : 2 – 4 – 1449 అశోక కాలని, హనమకొండ 506001, తెలంగాణ’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9701000306.
మినీ నవలల పోటీ 2024
వురిమళ్ల ఫౌండేషన్ ఖమ్మం వారు బాలలకు, యువతకు మినీ నవలల పోటీ నిర్వహిస్తున్నారు. ఏదైనా సామాజిక, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ, మానవీయ సంబంధాలు అంశాలపై 30 పేజీలకు తగ్గకుండా నవల రాయాలి. నవలలను కొరియర్, పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 30 లోపు ఇంనెం.11-10-694/5, బురహాన్‌పురం, ఖమ్మం – 507001 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9494773969.
‘అమృతలత – పాలపిట్ట’ దీపావళి కథల పోటీ
డాక్టర్ అమృతలత -పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి కథల పోటీ నిర్వహించాలని సంకల్పించాయి. సహజ ఇతివృత్తాలతో కూడిన కథలకు ఆహ్వానం పలుకుతున్నారు. మొదటి మూడు బహుమతులు, 10 ప్రత్యేక బహుమతులుంటాయి. కథలు చేరవలసిన చివరి తేదీ సెప్టెంబర్ 25. చిరునామా : ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం: 3, బ్లాక్-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్- 500044. ఫోను: 9490099327, ఈమెయిల్:palapitta books@gmail.com