సాహితీ వార్తలు

యోధ ఆవిష్కరణ
తెలంగాణ సాంస్కృతిక శాఖ, హస్మిత ప్రచురణలు విమెన్‌ రైటర్స్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో విజయ బండారు సంపాదకత్వంలో ‘యోధ’ ఆవిష్కరణ సభ ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతుంది. ఈ సభలో ఓల్గా, కె.శ్రీనివాస్‌, ప్రొ||కొలకలూరి ఆశాజ్యోతి, సంధ్య, మామిడి హరికృష్ణ, గోపరాజు సుధ, అపర్ణ తోట, ఘంటశాల నిర్మల, రచన, గిరిజ పైడిమర్రి పాల్గొంటారు.

‘నానీ కిరణాలు’ ఆవిష్కరణ
కంచనపల్లి రవికాంత్‌ కవితా సంపుటి ‘నానీ కిరణాలు’ ఆవిష్కరణ 27న ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి మినీహాల్‌లో జరుగుతుంది. ఈ సభకు డా.ఎన్‌.గోపి, డా.ఎస్‌.రఘు, ఆచార్య సూర్య ధనంజయ్, జి.శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌, తగుళ్ళ గోపాల్‌, తండ హరీష్‌ గౌడ్‌ హాజరవుతారు.

రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ ఆహ్వానం
తెలంగాణ భాషాసాంస్కతికశాఖ సౌజన్యంతో 2024 – రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభ ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డును ఏనుగు నరసింహారెడ్డి, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును అరుణ నారదభట్ల, కె.ఎల్‌ నర్సింహారావు స్మారక అవార్డును తండా హరీష్‌ గౌడ్‌, సాంబమూర్తి లండ అందుకుంటారు. ఈ కార్యక్రమంలో కె.శివారెడ్డి, లక్ష్మీనరసయ్య, ప్రసేన్‌, పేర్ల రాము, శ్రీనిధి విప్లవశ్రీ పాల్గొంటారు. ఇదే సభలో సాంబమూర్తిలండ కవితాసంపుటి ‘ఆమెకు మిగలని ఆమె’ ఆవిష్కరణ ఉంటుంది.

కవితలకు ఆహ్వనం
సురవరం ప్రతాపరెడ్డి గారి మూర్తిమత్వం పై కవితలను ఆహ్వానిస్తున్నాం. కవితలను అక్టోబర్‌ 30వ తేదీలోపు 9492765358 నెంబర్‌ వాట్సాప్‌కు గానీ, champaavathi@gmail.com కు గానీ పంపగలరు.
– వనపట్ల సుబ్బయ్య, 9492765358

కళింగాంధ్ర దళిత, మత్స్యకార కవితల కోసం
కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కవులు రాసి ఇప్పటికే అచ్చైన దళిత, మత్స్యకార కవితలతో విడివిడి సంకలనాలను ‘చంపావతి ప్రచురణలు’గా సంపాదకత్వంలో తీసుకొస్తున్నాను. మీ వద్ద వున్న పై విభాగాలకు చెందిన కవితలను, వాటి వివరాలను షష్ట్రaఎజూaaఙa్‌ష్ట్రఱఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కు పంపించాల్సిందిగా కోరుతున్నాను.
– బాలసుధాకర్‌, 9676493680, 9505646046