సాహితీ వార్తలు

జాతీయ స్థాయి జయప్రద, జమున అవార్డులకు నానీలు, నవలా సంపుటాలకు ఆహ్వానం
జాతీయస్థాయి జమున స్మారక నానీల సంపుటి అవార్డు, డాక్టర్‌ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి నవలా అవార్డులకు గాను నానీలు, నవలా సంపుటలు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు సోమిరెడ్డి వెంకట శేషారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తమ నానీల సంపుటికి రూ.10,000/-, ఉత్తమ నవలకు రూ.15,000/- ఇవ్వనున్నారు. 2022 నుంచి 2023 ఆగస్టు వరకు పబ్లిష్‌ అయిన నానీల సంపుటులు, నవలా సంపుటులు 3 కాపీలు పంపించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 31లోగా అవ్వారు శ్రీధర్‌ బాబు, 23-1-57, పెండెం వారి వీధి, ఫత్తేఖాన్‌ పేట, నెల్లూరు -524003 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 8500130770 నంబరు నందు సంప్రదించవచ్చు.
విమలక్క, నలిమెల భాస్కర్‌లకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం
పొన్నం సత్తయ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అందించే ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం’ ఈ ఏడాదికిగాను కళాకారుల విభాగంలో ప్రజా కళాకారిణి విమలక్క, సాహిత్య విభాగంలో బహూ భాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు ప్రధానం చేయ నున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ పొన్నం ప్రభాకర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో పురస్కార ప్రదానోత్సవం వుంటుందని, కార్యక్రమ పూర్తి వివరాలు త్వరలో తెలియ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏనుగు నరసింహారెడ్డికి ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం
ప్రముఖ తత్వ కవి ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కి గానూ ప్రముఖకవి, విమర్శకుడు ఏనుగు నరసింహారెడ్డికి ఇవ్వనున్నట్లు పురస్కార నిర్వాహకులు డా.ఉదారి నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 24 ఆదివారం నాడు అదిలాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు వారు తెలియజేశారు. వివరాలకు 9441413666 నంబరు నందు సంప్రదించవచ్చు.