సాహితీ వార్తలు

వర్తన ఆరవ సమావేశం
సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదుకొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఆరవ సమావేశం ఈ నెల 12 గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ‘తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం – ఆవశ్యకత – ఆచరణ’ అనే అంశంపై సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి గుడిపాటి అధ్యక్షత వహిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ సమన్వ యకర్తగా వ్యవహరిస్తారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.

‘ఎదురుచూపులు’ కవితాసంకలనం ఆవిష్కరణ
కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురించబడిన ‘ఎదురుచూపులు’ కవితాసంకలనం డిసెంబర్‌ 11,2024న హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభ కళామారుతి కళావేదికపై సాహితీవేత్త డా||వోలేటి పార్వతీశం ఆవిష్కరిస్తారు. ఈ సభకు నేటినిజం సంపాదకులు బైసదేవదాసు అధ్యక్షత వహించగా, డా||వై.రామకృష్ణారావు, గుదిబండి వెంకటరెడ్డి, డా||పులివర్తి కృష్ణమూర్తి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, కొసరాజు రాజేంద్రప్రసాద్‌, పొత్తూరి జయలకిë అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా సాహితీకిరణం సౌజన్యంతో ‘కన్నవారి కలలు-పిల్లల బాధ్యతలు’ అనే అంశంపై నిర్వహించిన కవితలపోటీ విజేతలకు బహుమతి ప్రదానం కావించబడుతుంది.