పీచర సునీతారావు 2024 సాహిత్య పురస్కారాలకు ఆహ్వానం
పీచరసునీతారావు పౌండేషన్ ఆధ్వర్యంలో కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహిత్య విభాగాల నుంచి సంపుటులను ఆహ్వానిస్తున్నది. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు వెలువడిన రచనలు మాత్రమే పంపించాలి. ఎంపికైన ప్రతి సంపుటికి రూ.15000/- ల బహుమతి ఉంటుంది. ప్రతి విభాగంలో మూడు కాపీలు పంపించాలి. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 10, 2025లోగా పీచర సునీతారావు పౌండేషన్, కేర్ ఆఫ్ విజయేందర్ రావు, ప్లాట్ నం. 505, బ్లాక్ – డి, భీమా ఫ్రైడ్ అపార్ట్‌మెంట్స్, సుచిత్ర సర్కిల్ దగ్గర, జీడిమెట్ల, హైదరాబాద్- 67, తెలంగాణ చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9866043441, 9848698699 నందు సంప్రదించవచ్చు.
సినారె పురస్కారం 2022కు కవితా సంపుటుల ఆహ్వానం
సాహితీగౌతమి ఆధ్వర్యంలో సినారె కవితా పురస్కారం 2022కు గాను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచన కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నారు. 2019, 20, 21 లలో ముద్రితమైన కవితా సంపుటులను 4 కాపీల చొప్పున పంపాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31లోగా కన్వీనర్, డా||ఎడవల్లి విజయేంద్రరెడ్డి, శివానంద ఆస్పత్రి, ఇం.నం.3-3-181, సవరన్ స్ట్రీట్, కరీంనగర్ -505001 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9490401861, 9395553393 నంబర్‌లలో సంప్రదించవచ్చు.
‘కొలకలూరి’ పురస్కారాలు – 2025
2025 ఏడాదికిగానూ కవిత్వం, నాటకం, పరిశోధనా గ్రంథాలపై పురస్కారాలను ఇవ్వనున్నారు. వీటిని కొలకలూరి భాగీరథీ కవిత్వం పురస్కారం, కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారం, కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారాలుగా ఒక్కొక్క విభాగానికి రూ.15,000/- చొప్పున బహుమతి అందించనున్నారు. ఈ మూడు విభాగాల్లో జనవరి 1, 2023 తర్వాత ముద్రితమైన వాటినే జనవరి 15 2025లోగా పంపించాలి. ఎంపికైన వారి వివరాలను ఫిబ్రవరి 15న ప్రకటిస్తారు. వారికి ఫిబ్రవరి 26న హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నిర్వహించే సభలో పురస్కారాలు ప్రదానం చేస్తారు.
చిరునామాలు
కవిత్వం, నాటకం విభాగాలు :
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (పూర్వ ఉపాధ్యక్షులు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), తెలుగు శాఖాధ్యక్షులు, పరీక్షా విభాగం డీన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 517502.; సెల్ : 9441923172
పరిశోధనా గ్రంథాలు :
ఆచార్య కొలకలూరి సుమకిరణ్, ఆంగ్లాచార్యులు, అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 517502 .; సెల్ : 9963564664
27న ‘నాగస్వరం’ ఆవిష్కరణ
కోయి కోటేశ్వరరావు కవితా సంపుటి ‘నాగస్వరం’ ఆవిష్కరణ సభ సాహితీ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్‌లో తోపుడు బండి సాధిక్ అలీ వేదికపై నిర్వహించనున్నారు. యం.యం. వినోదిని సభాధ్యక్షతన ముఖ్య అతిథిగా శిఖామణి హాజరై పుస్తకావిష్కరణ చేయనున్నారు. ఆత్మీయ అతిథులుగా యాకూబ్, నక్కా విజయరామరాజు, సంగిశెట్టి శ్రీనివాస్, పసునూరి రవీందర్, జె.నీరజ హాజరు కానున్నారు.