31న దివాకర్ల వేంకటావధాని
జీవితం-సాహిత్యంపై సదస్సు
సాహిత్య అకాడమీ, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న మంగళవారం ఆర్ట్స్ కాలేజి, రూమ్ నెంబర్ 121లో ప్రముఖ సాహితీవేత్త దివాకర్ల వేంకటావధాని జీవితం – సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షతన ఆచార్య శలాక రఘునాథ శర్మ కీలకోపన్యాసం, అనుమాండ్ల భూమయ్య, సంగనభట్ల నరసయ్య, కసిరెడ్డి వెంకటరెడ్డి, పిల్లలమర్రి రాములు, జి అరుణకుమారి, గండ్ర లక్ష్మణరావు పత్ర సమర్పణ చేస్తారు. కార్యక్రమంలో సి.మణాళిని, .సి.కాశీం, దివాకర్ల రాజేశ్వరి, .ఏలే విజయలక్ష్మి, ఎస్.రఘు పాల్గొంటారు.
సాహితీ పురస్కారాలు – 2025
రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని పలు విభాగాల్లో సాహిత్య పురస్కారాలకు రచయితలు వెలువరించిన పుస్తకాలు ఆహ్వానిస్తున్నారు. శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం, ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం, డా|| కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు తదితరములు), సాహితీ పురస్కారం (వ్యాసాలు / సమీక్ష / విమర్శ), బాల సాహిత్య పురస్కారం (కథ, కవిత, గేయ సంపుటులు), విజ్ఞాన / మనోవైజ్ఞానిక పుస్తక పురస్కారాలకు 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ప్రచురితమైన పుస్తకాలను మూడు కాపీల చొప్పున పంపించవచ్చు. గెలుపొందిన వారికి రూ.7000 చొప్పున నగదు పురస్కారం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు జనవరి 30 లోగా డా. మక్కెన శ్రీను, కేరాఫ్ : కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి, విజయనగరం జిల్లా- 535 101, ఏ.పి. చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 98852 19712 నంబరు నందు సంప్రదించవచ్చు.
సాహితీ కిరణం ‘ఉగాది కవితా పురస్కారం’
సాహితీ కిరణం సౌజన్యంతో శ్రీ విశ్వావసు నామ ఉగాది కవితల పోటీ నిర్వహిస్తోంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.2500/-, రూ.2000/-, రూ.1500/-లతో పాటు రూ.1000/- చొప్పున రెండు ప్రత్యేక బహుమతులు అందివ్వనున్నారు. కవిత 20 నుంచి 30 లైన్‌లు మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జనవరి 31లోగా పోస్ట్/ కొరియర్ ద్వారా మాత్రమే ఎడిటర్, సాహితీ కిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్- 500102 చిరునామాకు పంపించాలి. వివరాలకు 94907 51681 నంబరు నందు సంప్రదించవచ్చు.
కథా సంపుటాలకు ఆహ్వానం
నెలపొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం-2024 అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు 2023లో ముద్రితమైన కథా సంపుటాలను జనవరి 31లోగా మూడు ప్రతుల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పంపించవచ్చు. బహుమతి పొందిన కథా సంపుటికి రూ.పదివేల నగదు బహుమతిని ఏప్రిల్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందిస్తారు. ప్రతులను పి.అబ్దుల్ వహీద్ ఖాన్, ఇంటి నెం. 15- 120/4/1, రహత్ నాగర్ కాలనీ, నాగర్ కర్నూల్ – 509209, తెలంగాణ రాష్ట్రం చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9441946909 నంబరు నందు సంప్రదించవచ్చు.
గంటా కమలమ్మ సాహితీ పురస్కార విజేతలు
గంటా కమలమ్మ సాహితీ పురస్కారానికి సాంబమూర్తి లండ ‘నాలుగు రెక్కల పిట్ట’ తుల శ్రీనివాసులు ‘చింతల తొవ్వ’ కవితా సంపుటాలు సంయుక్తంగా ఎంపికయినట్టు పురస్కార వ్యవస్థాపకులు గంటా మోహన్ తెలిపారు. 2025 జనవరిలో నిర్వహించనున్న సాహితీ కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు సంయుక్తంగా 10000 రూ. నగదు, పురస్కార ప్రదానం జరుగుతుందని తెలిపారు.
‘తెలుగు సాహితీవనం’ కథలు, కవితలకు ఆహ్వానం
తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో కథా, కవితా విభాగాల్లో పురస్కారాన్ని అందించనున్నారు. కథల విభాగంలో నలుగురికి ఒక్కొక్కరికి రూ. 2,116, కవితల విభాగంలో నలుగురికి రూ.1116 చొప్పున నగదు బహుమతులు అందించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే తెలుగు సాహితీవనం వార్షికోత్సవ సభలో అందజేస్తారు. రెండు విభాగాల్లో వర్తమాన పరిస్థితులు, మానవ సంబంధాలు వంటి ఏ సాంఘిక ఇతివత్తాన్నైనా తీసుకుని పంపవచ్చు. కథ 1200 పదాలు, కవిత 25 వాక్యాలకంటే మించకుండా పంపించాలి. యూనికోడ్‌లో టైప్ చేసి టెక్స్ట్ రూపంలో మేమిచ్చిన గూగుల్ ఫామ్ ద్వారా పంపించాలి. ఆసక్తి కలిగిన వారు జనవరి 20 లోగా https://tinyurl.com/sahitivanam-poti పంపవచ్చు. వివరాలకు 9502236670, 83096 86404 నంబర్ల నందు సంప్రదించవచ్చు.