12న యాదయ్యకు అలిశెట్టి పురస్కారం
తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం 2024ను ప్రముఖ కవి బెల్లి యాదయ్యకు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం కరీంనగర్ ఫిలిం భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో నారదాసు లక్ష్మణరావు, నలమెల భాస్కర్, కొండి మల్లారెడ్డి, బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, నగునూరి శేఖర్ తదితరుల ఆధ్వర్యంలో అందించనున్నారు.
‘నిర్వాణ’ నవలపై వ్యాస రచన పోటీ
సద్ధమ్మ సాహితి ఆధ్వర్యంలో డా. బండి సత్యనారాయణ బౌద్ధ చారిత్రక నవల ‘నిర్వాణ’పై వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.3000/-, రూ.2000/-, రూ.1000/-లతో పాటు ప్రోత్సాహక బహుమతులు రూ.500/- చొప్పున ఇవ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు nirvaana2024@gmail.com కు ప్రియాంక ఫాంట్ 16 లో పీడీఎఫ్, పిఎండి ఫార్మాట్‌లో ఈ నెల 31లోగా పంపాల్సి ఉంటుంది. ‘నిర్వాణ’ నవల కాపీలకు 9989035136, 9246586254 నంబర్లందు సంప్రదించవచ్చు. ‘సద్దమ్మ సాహితి’ – వరంగల్‌లో నిర్వహించే కార్యక్రమంలో పుస్తకావిష్కరణతో పాటు వ్యాస రచనా పోటీ విజేతలకు బహుమతులు అందిస్తారు. వివరాలకు 9618598847 నంబర్ నందు సంప్రదించవచ్చు.
11న ‘గుల్‌మొహర్’ ఆవిష్కరణ
గుల్జార్ కవితలకు వెన్నెల సత్యం తెలుగు స్వేచ్ఛానువాదం ‘గుల్‌మొహర్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఈ నెల 11న శనివారం మధ్యాహ్నం 2 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాలులో నిర్వహించను న్నారు. కె. ఆనందచారి సభాధ్యక్షతన డా. ఏనుగు నర్సింహారెడ్డి పుస్తకాన్ని ఆవిష్క రిస్తారు. గౌరవ అతిథులుగా మౌనశ్రీ మల్లిక్, జెల్ది విద్యాధరరావు, రాపోలు సీతారామరాజు, డా.వి.జయ ప్రకాశ్, అనంతోజు మోహన్ కష్ణ పాల్గొననున్నారు.
డా.రాణీ పులోమజాదేవి స్మారక
కథా పురస్కారం-2025
తెలుగు సాహితీవనం సారథ్యంలో 2021 నుంచి 24 వరకు ప్రచురితమైన కథా సంపుటాలను ఆహ్వానిస్తోంది. ఎంపికైన కథా సంపుటికి రూ.5116/- పురస్కారాన్ని అందించనున్నారు. ఆసక్తి కలిగిన వారు 3 ప్రతుల చొప్పున జనవరి 31లోగా అరుణ నాయుడు తోట, చీజూ ూదీ గోదావరి, జ-బ్లాక్, చ-502, పైప్ లైన్ రోడ్, జీడిమెట్ల, హైదరాబాద్-67, మొబైల్ :6301930055 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9502236670 నంబరు నందు సంప్రదించవచ్చు.