సాహితీ వార్తలు

30న ‘గూడు చెదిరిన దృశ్యం’ ఆవిష్కరణ

కొండి మల్లారెడ్డి కవితా సంపుటి ”గూడు చెదిరిన దశ్యం” కవిత్వం ఆవిష్కరణ సభ 30 జనవరి, గురువారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు సిద్ధిపేట ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ప్రొఫెసర్‌ కోదండరాం, జూకంటి జగన్నాథం, బూర్ల వేంకటేశ్వర్లు, పర్కపెల్లి యాదగిరి, గఫూర్‌ శిక్షక్‌ హాజరవుతారు. సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం.
సైన్స్‌ ఫిక్షన్‌ కథల పోటీ -2025
జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా బాలబాలికల కోసం సైన్స్‌ ఫిక్షన్‌ కథల పోటీలను నిర్వహిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులు తెలుగు భాషలోనే రచనలను ఆహ్వానిస్తున్నారు. పది కథలకు రూ.1000/- బహుమతి చొప్పున అందజేయనున్నారు. ఎనిమిది పేజీలకు మించకుండా రాసి, ప్రిన్సిపల్‌ ధృవీకరణ పత్రాన్ని జత చేసి ఫిబ్రవరి 20లోగా వి.ఆర్‌. శర్మ, 304, ఎండికోస్‌ కౌంటి అపార్ట్‌మెంట్‌, జెక్‌ కాలనీ, వీధి నెం. 2. సనత్‌నగర్‌, హైదరాబాద్‌ – 018, సెల్‌ : 9177887749 ; గరిపెల్లి అశోక్‌, 404, వి.యల్‌.ఆర్‌. రెసిడెన్సీ, శ్రీనివాస నగర్‌, సిద్దిపేట్‌ – 502103, సెల్‌ : 9849649101 చిరునామాలకు పంపవచ్చు.
నేడు డా.పోతుకూచి సాంబశివరావు
97వ జయంతి ఉత్సవాలు

అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో డా. పోతుకూచి సాంబశివరావు 97వ జయంతి ఉత్సవాలు నేడు సోమవారం ఉదయం 10:30లకు హైదరాబాద్‌లోన అశోక్‌నగర్‌ కల్చరల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంస్కృతి కేంద్రంలో ఆచార్య కడారి సత్యమూర్తి సభాధ్యక్షతన నిర్వహించ నున్నారు. ముఖ్య అతిథిగా ఆచార్య డా|| గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, విశిష్ట అతిథిగా డా|| టి.గౌరీ శంకర్‌, ఆత్మీయ అతిథిగా ఆచార్య డా|| కసిరెడ్డి వెంకట రెడ్డి, గౌరవ అతిథిగా బైసా దేవదాస్‌లు పాల్గొననున్నారు.