9న మధుశ్రీ కథా గౌరవ సభ ముగ్గురికి పురస్కారం
మధునాపంతుల వేంకటేశ్వర్లు (మధుశ్రీ) కథా గౌరవ సభ ఫిబ్రవరి 9న ఆదివారం ఉదయం 10:00 గం||లకు కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెంలోని మధునాపంతుల కామరాజు సాంస్కతిక ప్రాంగణంలో మధునాపంతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కథా రచనలో విశేష కషి చేసిన ప్రముఖ రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు (తిరుపతి), ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి (విజయవాడ), ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ కాళ్ళకూరి శైలజలకు కథా గౌరవ పురస్కారాలను అందివ్వనున్నారు. మధునాపంతుల సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ఫౌండేషన్ కార్యదర్శి ఎం.వి. చలపతి స్వాగతంతో పాటు, పరిచయ కర్తలుగా బీకేఎస్ రాజా (హైదరాబాద్), వసుధారాణి (విజయవాడ), డాక్టరు కె.రామచంద్రారెడ్డి (హైదరాబాద్) వ్యవహరించనున్నారు. వివరాలకు 9704186544 నంబరు నందు సంప్రదించవచ్చు.
ప్రత్యేక సంచికకు కథలు ఆహ్వానం
నవమల్లెతీగ సాహిత్య మాసపత్రిక ఆధ్వర్యంలో త్వరలో కథల ప్రత్యేక సంచికను తీసుకు రానున్నారు. ఇందుకోసం కథలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు మూడు లేదా నాలుగు పేజీలకు మించకుండా టైప్ చేసి, ఈ నెల 27 లోగా 6-16-4, టి.ఎఫ్-1, శుభశ్రీ టవర్స్, ఉయ్యూరు జమీందారు స్ట్రీట్, గాంధీనగర్, విజయవాడ-520 003 చిరునామాకు లేదా ఈమెయిల్ : ఎaశ్రీశ్రీవ్వవస్త్రaఏస్త్రఎaఱశ్రీ.షశీఎ పంపాలి. వివరాలకు 92464 15150 నంబరు నందు సంప్రదించవచ్చు.
6న ‘ధరణి’ ఆవిష్కరణ
వి.బాలరాజు రచించిన ధరణి రైతుల గోస పుస్తకావిష్కరణ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రవీంధ్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నారు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సభాధ్యక్షులుగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ యం.కోదండరాం రానున్నారు. వక్తలుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మానవహక్కుల వేదిక నాయకులు యస్..జీవన్ కుమార్, రెవెన్యూ శాఖ మాజీ అధ్యక్షులు,పెన్షనర్స్ జేఏసీ చైర్మెన్ కె.లక్ష్మయ్య, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, రిటైర్డు జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్లు హాజరు కానున్నారు. వివరాలకు 94409 39160 నంబరు నందు సంప్రదించవచ్చు.