సాహితీ వార్తలు

రొట్టమాకురేవు కవిత్వ అవార్డుసభ -2023
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్టోబర్‌ 15 ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు, రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సభలో షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డు (ప్రసేన్‌/ ఎవరికి వర్తిస్తే వారికి…), పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు (పెనుగొండ సరసిజ/ ఇక మారాల్సింది నువ్వే), కె.ఎల్‌ నర్సింహారావు స్మారక అవార్డు (తెలుగు వెంకటేష్‌/ తూనీగతో సాయంకాలం, సుంకర గోపాలయ్య/ మా నాయిన పాట) అందుకోనున్నారు. సభలో అతిథులుగా కె. శివారెడ్డి, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ, జి. లక్ష్మీనరసయ్య పాల్గొంటారు.
                                                                                                                                             – కవియాకూబ్‌, శిలాలోలిత
‘పిడికెడు మట్టి’ నవల ఆవిష్కరణ
సృజన సాహితీ నల్లగొండ ఆధ్వర్యంలో బండారు శంకర్‌ రచించిన పిడికెడు మట్టి నవల ఆవిష్కరణ అక్టోబర్‌ 15వ తేదీన నల్లగొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్‌ హాల్‌ లో జరుగుతుందని సజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్‌ తెలిపారు. డాక్టర్‌ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో గింజల నరసింహారెడ్డి, అంపశయ్య నవీన్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మునాసు వెంకట్‌, కదిరే కృష్ణ, కార్టూనిస్ట్‌ శంకర్‌, వేనేపల్లి పాండురంగారావు, బండారు దానయ్య కవి తదితరులు పాల్గొంటారు.
కోపూరి శ్రీనివాస్‌ స్మారక పోస్ట్‌ కార్డు కథలపోటీ
రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్‌ స్మారక పోస్ట్‌ కార్డు కథల పోటీలు నిర్వహిస్తున్నది. విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 1000/-, 800/-, 500/- లతో పాటు ప్రోత్సహక బహుమతులుగా 2 కథలకి ఒకొక్కటి 200/- చొప్పున ఇవ్వబడతాయి. సామాజిక స్పృహ కలిగిన ఏ అంశంమీదైనా కథలు పోస్ట్‌ కార్డు పై మాత్రమే రాసి పంపాలి. ఏ ప్రాంతంలోఉన్న తెలుగు రచయితలైనా ఒక రచయిత మూడు కథలు వరకు పంపవచ్చు. రచయితలు తమ కథలను అక్టోబర్‌ 31వ తేదిలోగా ‘రమ్యభారతి’ పోస్ట్‌ పోస్ట్‌ బాక్స్‌ నెంబర్‌.5, విజయవాడ-520001 చిరునామాకు పోస్ట్‌ ద్వారా మాత్రమే పంపాలి.
                                                                                                                                    – చలపాక ప్రకాష్‌, సంపాదకుడు
గద్దర్‌ స్ఫూర్తి సంచిక ఆవిష్కరణ
అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అక్టోబర్‌ 10 వ తేది మంగళవారం సాయంత్రం 5గం. లకు హైదారాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ‘బహుజన కెరటాలు గద్దర్‌ స్ఫూర్తి సంచిక’ ఆవిష్కరణ సభ జరుగుతుంది . అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జరిగే ఈ సభలో గోరటి వెంకన్న, లెల్లే సురేశ్‌, కోయి కోటేశ్వరరావు, జిలకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, ఆచార్య లక్ష్మినారాయణ, ఆచార్య భంగ్య భూక్య, ఆచార్య శ్రీపతి రాముడు, డా కె. వై. రత్నం, పల్నాటి శ్రీరాములు, ఆచార్య సునీత రాణి తదితరులు పాల్గొంటారు.
‘మనుషులమై బ్రతకాలి’ ఆవిష్కరణ
డా|| కె. దివాకరాచారి కవితా సంపుటి ‘మనుషులమై బ్రతకాలి’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 15వ తేదీ ఉదయం 10 గంటలకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో జరుగుతుంది. సభకు కె. ఆనందాచారి అధ్యక్షత వహిస్తారు. కె.శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సబలో డా| పి.జ్యోతి, తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహనకృష్ణ, గుడిపాటి ప్రసంగిస్తారు.
                                                                                                                                                            – పాలపిట్ట బుక్స్‌
‘రాళ్లూ చిగురిస్తాయి’ ఆవిష్కరణ సభ
పొత్తూరి సుబ్బారావు రచించిన ‘రాళ్లూ చిగురిస్తాయి’ కవితాసంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 20 తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరుగుతుంది. ఇందులో డా||కె.వి.రమణాచారి, బైస దేవదాసు, వి.ఎస్‌.జనార్ధన మూర్తి, డా||వై.రామకృస్ణారావు, కొసరాజు సామ్రాజ్యం, పెద్దూరి వెంకటదాసు పాల్గొంటారు. ఈ సభలోనే ‘దసరా సరదాలు’ కవి సమ్మేళనం జరుగుతుంది.
                                                                                                                                      ‘స్వయం సిద్ధ’ సమాలోచన సదస్సు – 2023
ఈ నెల 16వ తేదీ రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ‘స్వయం సిద్ధ’ సమాలోచన సదస్సు రెండు సెషన్లుగా జరుగుతుంది. ఈ సదస్సులో మామిడి హరికృష్ణ, విజయ భండారు, ఓల్గా, కొండెపూడి నిర్మల, కవిత పులి, సుల్తాన షాహీన్‌, పి.జ్యోతి, డా||భారతి, డా||గోగు శ్యామల, మానస ఎండ్లూరి పాల్గొంటారు.
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం- 2023
రంగినేని ట్రస్టు అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు ‘రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారం ఎంపిక కోసం 2021, 2022, 2023 సంవత్సరాలలో ప్రచురించబడిన తెలుగు కవితా సంపుటాలు 5 ప్రతులను ఈ సంవత్సరం నవంబర్‌ 15వ తేదీ లోపు అందేట్లు పంపవలసిందిగా కోరుతున్నారు. విజేతలకు అవార్డు కింద 25000/- నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేస్తారు. రంగినేని ట్రస్టు, సిరిసిల్లలోనిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తారు. కవితా సంపుటాలను పంపవలసిన చిరునామా : అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం – 2023, రంగినేని సుజాతా మోహనరావు ఎడ్యుకేషన్‌, చారిటబుల్‌ ట్రస్టు, బాలాజీ నగర్‌, సిరిసిల్ల – 505301, రాజన్న సిరిసిల్ల జిల్లా.
                                                                                                                                            – రంగినేని మోహనరావు