సాహితీ వార్తలు 17న

‘అంబపలుకు’ ఆవిష్కరణ
ఈ నెల 17న పి.శ్రీనివాస్‌గౌడ్‌ రచించిన ‘అంబపలుకు’ రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకు కె.శివారెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. మామిడి హరికష్ణ పుస్తకావిష్కరణ చేయనున్న ఈ కార్యక్రమంలో ఎన్‌. వేణుగోపాల్‌, ఏ.కె.ప్రభాకర్‌ పుస్తక సమీక్ష చేస్తారు. ముఖ్య అతిథులుగా నిజం శ్రీరామమూర్తి, డా.జి.వి. రత్నాకర్‌, కటుకోఝ్వల ఆనందాచారి, మెర్సీ మార్గరెట్‌, నస్రీన్‌ ఖాన్‌, సలీమ, పద్మకళ హాజరు కానున్నారు.
పాలమూరు సాహితి అవార్డు-2024కు కవితా సంపుటాల ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు 2024లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన సంపుటికి రూ.5,116/- అందజేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31 లోగా డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, ఇం.నం. 8-5-38, టీచర్స్‌ కాలని, మహబూబ్‌ నగర్‌ – 509001, తెలంగాణ రాష్ట్రం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. వివరాలకు 9032844017 నంబరు నందు సంప్రదించవచ్చు.
తెలంగాణ తల్లికి కవితార్చన కవితలకు ఆహ్వానం
‘తెలంగాణ తల్లికి కవితార్చన’ పేరుతో రావిరాల బసవయ్య, తాడిచర్ల రవి త్వరలో కవితా సంపుటి తీసుకురానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లోని ఆసక్తి కలిగిన కవులందరూ కవితలు పంపవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31లోగా 9949758054, 8919800447 వాట్సాప్‌ నంబర్లకు లేదా ravithadicherla@gmail.com, basavaiah.ravirala14@gmail.com మెయిల్‌కు పంపవచ్చు.