– రూ.3 లక్షల నగదు ప్రోత్సాహం అందజేత
హైదరాబాద్: 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ పారా అథ్లెట్, తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజికి కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఆర్థిక సహాయం అందించారు. సోమవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీప్తిని చిరంజీవి ఘనంగా సన్మానించారు. రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దీప్తి ప్రతిభ, శ్రమకు తగిన గుర్తింపు లభించిందని చిరంజీవి తెలిపారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరనాథతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.