నా కోసం కాదు.. ప్రజల కోసమే బతుకుతా..

– అభివద్ధిని చూడండి… ఆశీర్వదించండి
– ప్రజలే బలం ప్రగతే ధ్యేయం
– చిల్లర రాజకీయాలు చేయను… తాటాకు చప్పుళ్ళకు భయపడొద్దు
నవతెలంగాణ -నకిరేకల్‌
ప్రజా సంక్షేమం, అభివద్ధి ధ్యేయంగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముందుకు సాగుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ నకిరేకల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ కొడతానన్న ధీమాతో ఉన్న చిరుమర్తి తో నవతెలంగాణ నకిరేకల్‌ ప్రతినిధి వై. శాంతి కుమార్‌ ముఖాముఖి ఇంటర్వ్యూ.
ప్రశ్న : నకిరేకల్‌ నియోజకవర్గంలో చేసిన అభివద్ధి ఏమిటి ?
నకిరేకల్‌ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రూ 1000 కోట్లకు పైగా నిధులతో అభివద్ధి పనులు చేసినం. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1. 23 కోట్లతో రైతు వేదికలు, రూ. 18 కోట్లతో వైకుంఠధామాలు, రూ. 19 కోట్లతో 126 పల్లె ప్రకతి వనాలు, రూ. 5కోట్లతో 8 పకతి వనాలు, రూ. 5 కోట్లతో 128 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం.నకిరేకల్‌ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ. 32 కోట్లతో పనులు ప్రారంభించాం. మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. పట్టణంలో రూ. 26 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణ పనులు, నార్కట్‌ పల్లి లో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు రూ. 200 కోట్లు మంజూరు చేయించి ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయ్యింది. ధర్మారెడ్డి పల్లి, పిల్లాయిపల్లి కాలువల పనులు పూర్తయ్యాయి. ఐటిపాముల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు రూ. 100 కోట్ల మంజూరు చేయించి పనులు ప్రారంభించాం. నార్కట్‌ పల్లి లో రూ. 16 కోట్లతో రోడ్లు విస్తరణ పనులు చేస్తున్నాం. రూ.6 కోట్లతో నకిరేకల్‌ కాలం వారికుంట మినీ వాటర్‌ ట్యాంక్‌ బండ్‌ మొదటి దశ పనులు పూర్తయ్యాయి.
ప్రశ్న : రానున్న ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారస్త్రాలు ఏవి.
నియోజకవర్గంలో నేను చేసిన అభివద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ప్రాజెక్టు, నకిరేకల్‌ లో డిగ్రీ కళాశాల, నార్కట్‌ పల్లి లో జూనియర్‌ కళాశాల ఏర్పాటు.. ఇవన్నీ పేద విద్యార్థులకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కషి చేశా. కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు తదితర పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన కార్యక్రమాలను చెబుతున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకతి వనాలు, టిఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వివరిస్తుంటే ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది.
ప్రశ్న: కెసిఆర్‌ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్‌.
కేసీిఆర్‌ ప్రభుత్వం పై ప్రజలకు ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తో ప్రజలు ఆనందంగా ఉన్నరు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ కుర్చీలాట. కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని గ్రామాలలో బలమైన చర్చ జరుగుతుంది. ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటుండ్రు. రౌడీ రాజకీయాలకు, హత్య రాజకీయాలకు స్థానం లేదు అరాచక వాదులకు ఓట్లు వేయరు. నియోజకవర్గం శాంతియుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటుండ్రు.
ప్రశ్న : నకిరేకల్‌ నియోజకవర్గంలో అభివద్ధి పనులు జరగలేదని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన.
సోయి ఉన్నోళ్లు ఆ మాట మాట్లాడరు. పోయినసారి అన్ని నియోజకవర్గాలకు నిధులు వచ్చినరు. నీవెందుకు తీసుకురాలే. రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడటం తప్ప అభివద్ధిపై దష్టి పెట్టలేదు. ఇవాళ నేను కష్టపడి తీసుకొచ్చిన అభివద్ధి పనుల గురించి ప్రజలకు తెలుసు. నేను ఏం చేసినన్నది ప్రజలు గుర్తుపడతారు. నీవు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆలోచిస్తుండ్రు నీ విధానం, ఏజెండా ఏంది.. నా విధానం ఏంది అన్నది ప్రజలకు తెలుసు.
ప్రశ్న : ఐటిపాముల ప్రాజెక్టుకు సంబంధించి జీవో కాపీ నేను తీసుకొచ్చానని ప్రత్యర్థి అంటుండు. దీనిపై మీ సమాధానం
2017లో నీవు జీవో కాఫీ తీసుకొచ్చిన%శీ%ట్టున్నావ్‌. ఆ జీవో కాపీని ప్రజల ముందు పెట్టు. మాయమాటలు చెప్తే ఎవరింటరు. కష్టపడి జీవో తీసుకువచ్చింది నేను. పనులు ప్రారంభించాం. చిత్తశుద్ధితో, విశ్వాసంతో రైతుల కోసం పనిచేస్తున్నాం. పొద్దున లేస్తే అబద్దాలు చెప్పడం అలవాటు కదా.. నీలాంటి వ్యక్తులను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అబద్దాలతో కమ్మిస్తే కమ్మిపోతాయా..
ప్రశ్న : ఈ ఎన్నికల్లో ప్రధానంగా మీకు ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో నాకు ప్రత్యర్థి ఎవరూ లేరు. ప్రజలను నమ్ముకున్న. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కెసిఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి ల సహకారంతో చేసిన అభివద్ధి పనులు, నా ఎజెండాను నమ్ముకుని ముందుకు పోతున్న. ప్రజలు నన్ను దీవిస్తరు. మంచి మెజార్టీతో గెలిపిస్తరు.
ప్రశ్న : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యలు ఏమన్నా తీసుకున్నారా ?
నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు ఐటి రంగంలో చాలా పెట్టుబడును పెట్టినం. నల్లగొండ కు ఐటి హబ్‌ తీసుకొచ్చాం. సూర్యాపేట కు ఐటీ హబ్‌ వస్తుంది. మెడికల్‌ కాలేజ్‌ తీసుకొచ్చాం ఎంతోమందికి అవకాశం కల్పిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ ఏ ఉద్యోగాలను ఇచ్చిందో యువతకు తెలుసు. ఉద్యోగాలు ఇవ్వలేని కాంగ్రెస్‌ ఎన్నో మాయమాటలు చెప్తుంది. యువత వాటిని నమ్మరు.
ప్రశ్న : నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి
ఈ నాలుగున్నరెండ్ల కాలంలో చేయవలసిన అభివద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసినం. ప్రత్యర్థి వర్గం చేస్తున్న మాయ మాటలు నమ్మవద్దు. ప్రజలే నా ఆశ. నా శ్వాస. వారి కోసమే బతుకుతా.. చేసిన అభివద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించండి. బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తాటాకు చప్పులకు భయపడొద్దు. ప్రజలు చాలా తెలివైన వారు. గతంలో ఏం జరిగింది. ఇప్పుడు ఏం అభివద్ధి జరిగిందన్న విషయాన్ని గమనిస్తున్నరు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మరు. పనిచేసే నాయకుడిని, అభివద్ధి చేసే నాయకుడిని ప్రజలు కోరుతుండ్రు.రానున్నది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. పెండింగ్‌ లో ఉన్న పనులను కచ్చితంగా పూర్తి చేసుకుందాం. వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌, వంద పడకల ఆసుపత్రి, ఐటిపాముల ప్రాజెక్టు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుందాం.