హైదరాబాద్‌లో తొలిసారి లైవ్‌ షో..

Live show for the first time in Hyderabad..హైదరాబాద్‌ మహానగరంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తొలి లైవ్‌ షో పర్ఫార్మెన్స్‌ ఇవ్వబోతున్నారు. డిఎస్‌పి లైవ్‌ ఇండియా టూర్‌లో భాగంగా ఆయన హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 25 ఏండ్లుగా సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన దేవీశ్రీ ప్రసాద్‌ మొదటి సారి హైదరాబాద్‌లో లైవ్‌ షోతో సంగీత ప్రియుల్ని పలకరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏసీటీసీ ఈవెంట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఈ హై వోల్టేజ్‌ డీఎస్‌పీ కాన్సర్ట్‌ని చూడాలనే ఆసక్తి ఉన్నవారు ఏసీటీసీ ఈవెంట్‌లు, డిఎస్‌పి సోషల్‌ మీడియా ఖాతాలను గమనిస్తూ ఉండండి. అలాగే అక్టోబర్‌ 19న హైదరాబాద్‌లో జరగబోయే ఈ ఈవెంట్‌ వివరాలను ఏసీటీసీ ఈవెంట్‌ అధికారిక వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌ కాన్సర్ట్‌ కోసం టిక్కెట్లు పొందాలంటే ఎసీటీసీ అధికారిక వైబ్‌ సైట్‌, పేటీఎమ్‌ ఇన్‌సైడర్‌లో టిక్కెట్స్‌ కొనుగోలు చేయవచ్చు. ఈనెల 14 నుంచి టికెట్లు అందు బాటులో ఉంటాయి.