నవతెలంగాణ-జహీరాబాద్
గ్రామీణ చిరుధాన్యాలు పండించే రైతులకు నాబార్డు నిధులతో జీవనోపాధి కల్పిస్తున్నట్టు నాబార్డ్ ఏజీఎం వి.కష్ణ తేజ అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో కేవీకేలో సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కష్ణతేజ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగు విధానం, వాటి నుండి వచ్చే విలువ ఆధారిత జోడింపులపైన వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంద న్నారు. ఈ శిక్షణ తీసు కోవడం వలన కలిగే లాభాలు, ఈ శిక్షణ పూర్తి అయినా తర్వాత నాబార్డ్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో తెలిపారు. కేవీకే ఇంచార్జి హెడ్ యన్. స్నేహలత వారం రోజుల శిక్షణ నివేదికను పూర్తిగా వివరించారు. కార్యక్రమం మొదటి రోజులో భాగంగా భూసారా పరీక్ష నిపుణులు ఈ. స్వామి భూమి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విష యాలపైన అవగాహన కల్పిస్తారన్నారు. పొలంలోలో పంట లేనప్పుడు మట్టి నమూనాలు సేకరించి మట్టి పరీక్ష చేj ుడం వలన మన భూమి ఆరోగ్యం క్లుప్తంగా అర్థం అవు తుం దని.. దాని ప్రకారం యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఎండాకాలంలో పొలం చుట్టూ గెట్లు ఎత్తుగా వేసికోవడం లేక చిన్న చిన్న కాలువలు చేయ డం వలన ఎక్కువ వర్షాలు పడినపుడు భూమిలో ఉన్న పోష కాలు కొట్టుకుపోకుండా కాపాడుకోవ చ్చునని వివరించారు. వి.రమేష్ శాస్త్రవేత్త సేద్యవిభాగం చిరుధాన్యాల ప్రాముఖ్య త, అవి వేయడం వలన భూమికి మనకి కలిగే లాభాల గురిచి.. అవి ఏవిధంగా పండించాలి అనే విషయాలను రైతుల కు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బి.శ్రీకా ంత్, శ్రీధర్, జగన్, లక్ష్మణ్, మహిళా రైతులు పాల్గొన్నారు.