
ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ, ఎలక్ట్రీషియన్ శిక్షణలతో జివనోపదికి బాట వేసుకోవచ్చని, ప్రతి శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ డిడిఎం ప్రవీణ్, టిజిబి రీజినల్ మేనేజర్ నవీన్ కుమార్ అన్నారు.బుదవారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. డిచ్ పల్లి ఆద్వర్యంలో ఫోటో, విడియో గ్రాఫి , ఎలాక్ట్రిషన్ 30 రోజులు శిక్షణలను బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా ప్రవ్రీణ్, నవీన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాబార్డ్ సంస్థ ద్వారా అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఫోటోగ్రఫీ, ఎలక్ట్రీషియన్ శిక్షణలు భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ సంస్థ అర్ ఎస్ఈటిఐ ట్రైనింగ్స్ శిక్షణ కోసం చాలా రకాల పరికరాలను అందజేస్తుందని పేర్కొన్నారు. వాటిని ఉపయోగించి జీవితంలో స్థిరపడి కుటుంబానికి ఆధారంగా నిలబడాలని సూచించారు. ఫోటోగ్రఫీ అనేది ప్రతి వ్యక్తి ముఖంలో ఒక నవ్వును తెప్పిస్తోందని ,జీవితంలో మంచి మరువలేని జ్ఞాపకాలను ఉంచుతుందని దీనికి చాలా చక్కని భవిష్యత్ ఉందని, ఎలాక్ట్రిషియన్ కు మంచి అవకాశాలు ఉన్నాయని కొత్తగా ఇల్లు కట్టాలంటే ఎలక్ట్రీషియన్ చాలా ముఖ్యమని వివరించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను యువతకు అందిస్తున్న ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణా అంతరం బ్యాంక్ ల ద్వారా రుణాలు ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని ఇలాంటి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్, కార్యాలయా సిబ్బంది రామకృష్ణ , తోపాటు గెస్ట్ ఫాకల్టీ లు పాల్గొన్నారు.