నవతెలంగాణ-ఓయూ
బంగారు తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆదం సంతోష్ కుమార్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడా నికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్తీ పోరు కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను సంతోష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారనీ, ఇప్పటి వరకు 500 కూడా నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. మాటల గారడితో నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్‌ను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు అని ప్రశ్నింంచారు. అడ్డగుట్ట ఏర్పడి 40 ఏండ్లు గడిచినా డ్రయినేజీ వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. నాళాల ఆధునీకరణ జరగలేదనీ, నియోజకవర్గంలో ఇంటర్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటైనా సొంత భవనాలు, కనీస వసతుల్లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ట్రాఫిక్ సమస్య పరిస్కారం కోసం రోడ్ల విస్తరణ జరిగలేదనీ, మెట్టుగూడ స్మశాన వాటికలో ఆక్రమణలను తొలిగించలేదనీ, కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదం సజన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సమస్యల సాధనకు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేం లేదన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, జయరాజ్, చక్రధర్, హరి, బాబ్ల్యూ, అబ్బుబై, మహేష్, మహేందర్, కిరణ్, బాబు, చలం, నర్సింగ్, శబానా బేగం, గులాం, మగ్ధూమ్, తదితరులు పాల్గొన్నారు.