ఇందిరమ్మ రాజ్యం వస్తేనే జీవితాలు బాగుపడతాయి

నవతెలంగాణ-జన్నారం
దేశంలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు టేకుమెట్ల పంకజ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిందని మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. అదేవిదంగా దేశంలో సైతం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అందరూ చేతిగుర్తుకు ఓటు వేసి మండలానికి చెందిన ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగునక్కను భారీ మెజారిటితో గెలిపించి పార్లమెంటుకు పంపి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమ పాలన ఉండేదని అప్పుడు దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేసిందని అయన తెలిపారు. అదేవిదంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేస్తున్న ప్రజా సంక్షేమ పనులను చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజాధారణ చూసి ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఇక్కడ అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండాలని మే 13 జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే విదంగా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.