1293 మంది రైతులకు రుణమాఫీ

Loan waiver for 1293 farmers– జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు 

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిట్యాల, వడ్డెకొత్తపల్లి, అవుతాపురం క్లస్టర్ పరిధిలోని 1293 మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి స్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పాల్గొని ప్రసంగించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. రుణమాఫీ తో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని, రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజుగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఏఈవో లు యశస్విని, ప్రవళిక, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, ఓరిగంటి సతీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, లింగమూర్తి, సుధాకర్, మహిళా నాయకులు బెడద మంజూల, సీతారాం నాయక్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, గద్దల ఉప్పలయ్య, ముక్తార్ పాషా, ఎంపీఓ సత్యనారాయణ, ఆర్ఐ భూక్యా లష్కర్ తదితరులు పాల్గొన్నారు.