యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ రేషన్ కార్డ్ లేక రుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల నిర్దారణ ప్రక్రియను యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూర్ లో శుక్రవారం పరిశీలించారు. మండల వ్యవయాధికారిణి సుధారాణి మండలం లోని రేషన్ కార్డు లేక రుణమాఫి కాని రైతు కుటుంబాల నిర్ధారణ శుక్రవారం చిన్నకందుకూరు గ్రామంలో నమోదు చేశారు. రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతుల ఇంటింటికీ వెళుతూ ప్రత్యేక యాప్ లో రైతుల వివరాలు నమోదు చేస్తూ వారి కుటుంబ సభ్యులతో సెల్ఫీ ఫోటో దిగి యాప్ లో అప్ లోడ్ చేశారు. అలాగే వారి నుండి కుటుంబ దృవీకరణ పత్రం కూడా తీసుకొని యాప్ లో నమోదు చేశారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ కుటుంబ నిర్దారణ ప్రక్రియను రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో ఏ ఓ సుధరాణి, ఏ ఈ ఓ మౌన్య రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.