రూ.2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేయాలి

Loan waiver of Rs.2 lakh should be done without restrictions– సహకార సొసైటీ సమావేశం లో తీర్మానం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి సహకార సొసైటీ పరిధిలోని రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా అమలు చేయాలని తీర్మానం చేశారు. సోమవారం ఖిల్లా డిచ్ పల్లి మహాజన సభ సమావేశం నిర్వహించారు.  సహకార సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ సహకార సంఘం పరిధిలో 13 గ్రామాలు 739 మంది రైతు సభ్యులుగా ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందని ఖరీఫ్ పంటలకు వరి ధాన్యం కనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా భార్దన్, ఇతర సౌకర్యాలు, కూలీలను అందుబాటులో ఉంచుతామని, ప్రతి రైతు పండించిన వరి ధాన్యాన్ని కనుగోలు చేస్తామని చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు తీర్మానాలు చేశారు. సహకార సొసైటీ ఆధ్వర్యంలో రైతులందరికీ సన్నధాన్యానికి ప్రభుత్వం ద్వారా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, రెండు లక్షల ప్రభుత్వ రుణమాఫీ కంటే ఎక్కువ రుణ ఉన్న రైతులకు సొసైటీ ద్వారా పూర్తిగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని తీర్మానించారు. ఇప్పటివరకు సహకార పరిధిలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం ద్వారా 3 కోట్ల 72 లక్షల రూపాయలు 376 మంది రైతులకు అందిచారని  ప్రభుత్వం రుణమాఫీ ఇంకా 336 మందికి అందేది ఉందని చైర్మన్ రామచంద్ర గౌడ్ వివరించారు. ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేయాలని రైతులందరూ తీర్మానించినట్లుగా రాంచందర్ గౌడ్ వేల్లాడించారు. డిచ్ పల్లి గ్రామంతో పాటు ఈతర గ్రామాలలో ఖాళీ గోదాములు మరమ్మత్తులు చేసి కొత్తగా నిర్మించడానికి రైతులు పేర్కొన్నారని తెలిపారు. సహకార సంఘం సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ పాత గోదాం స్థానాలలో కొత్తగా వ్యాపార సముదాయాలకు షట్టర్లు నిర్మించే ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా డిచ్ పల్లి సహకార సొసైటీ వైస్ చైర్మన్ కుమ్మరి గంగారం, డైరెక్టర్లు దాసరి రమేష్, బాలమల్లు సాయిలు, ఏలేటి సతీష్ రెడ్డి, ఎడ్ల శ్యాం సన్, సిఈఓ కిషన్ ,సహకార సొసైటీ సిబ్బంది సాయిలు  రైతులు పాల్గొన్నారు.