రైతుల రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి

– వరి పంటకు 500 బోనస్ ఇవ్వాలి
– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు డిమాండ్
నవతెలంగాణ – అచ్చంపేట 
రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని,  రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరి పంట దిగుబడి రానందువలన మద్దతు ధర ఇస్తూ.. ప్రతి కింటాకు రూ 500 బోనస్ ప్రకటించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్థo. పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పిన మాట పైన నిలబడాలని,  అధికారంలోకి రాంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ  చేసి తీరుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం   మాటను నిలబెట్టుకోవాలని వారు అన్నారు.  దేశంలో నిరంతరం శ్రమించి వ్యవసాయం చేస్తున్న రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా రైతులు పండించే పంటకు మద్దతు ధర ప్రకటించకుండా నిర్లక్ష్యం చేయడం తగదు అన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. కృష్ణా జలాల్లో ఉన్న నీళ్లు తగ్గుముఖం పట్టడంతో రైతులు వేసుకున్న పంట  ఎండలతో ఎండిపోతుందని అట్లాంటి రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశా నాయక్ జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్ మల్లేష్ , తదితరులు న్నారు.